Pre-Nursery Fees In Bengaluru: తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడరు. కానీ, వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలలు దోపికి పాల్పడుతున్నాయి. ఫీజుల సాకుతో పేరెంట్స్ నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను పెంచుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలను చదువుకు దూరం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా, ఇటీవల నర్సరీ విద్యార్థికి రూ. 1.85 లక్షల ఫీజు సంబంధించిన రసీదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరులో ప్రీ-నర్సరీ స్కూల్ ఫీజులు లక్షల్లో ఉండడంపై ఒక రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది.
Read Also: Ukraine-Russia: రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు.. 2 వంతెనలు పేల్చివేత
అయితే, బెంగళూరులోని ఒక పాఠశాలలో కేవలం ప్రీ-నర్సరీ తరగతికి వార్షిక ఫీజు సుమారు రూ. 1.85 లక్షలు ఉంటుందని రెడిట్ యూజర్ చేసిన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో “ఒక పసిపాప ప్రీ-స్కూల్ ఫీజు ఇంత భారీగా ఉండడం సబబేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రీ-స్కూల్‌కు ఎంత ఫీజు ఉంటే బాగుంటుంది? అంటూ ప్రశ్నించారు. ఇక, ఈ ఫీజు అంచనాలో రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 5,000, రెండు విడతల్లో చెల్లించాల్సిన కన్స్యూమబుల్స్ రూ. 28,240, అలాగే జూన్ నుంచి నవంబర్ వరకు రూ. 91,200, మిగతా మొత్తం రూ. 60,800 ఉన్నాయని అతడు పేర్కొన్నాడు. ఈ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి.. పేదలకు విద్య అందుబాటులో లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక, ప్రీ- నర్సరీ క్లాస్ కి ఒక లక్ష రూపాయలను గరిష్ట పరిమితిగా నిర్ణయించాలి అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. అంతకు మించి ఫీజులు వసూలు చేయకూడదు అన్నారు. ఎందుకంటే విద్య ధనవంతులకే పరిమితం కావడానికి ఇది ఒక కారణం అని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, చాలా మంది ఇలాంటి అధిక ఫీజులు వసూలు చేయడం సర్వ సాధారణంగా మారిపోయాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నా చదువుకు మొత్తం లక్ష రూపాయల కంటే తక్కువ ఖర్చు చేశాను.. కానీ, ఇప్పుడు ఒక ఏడాది కిండర్‌గార్డెన్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారు అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. మరొక వినియోగదారుడు.. నా మేనకోడలి కోసం రూ. 4 నుంచి 5 లక్షలను నా సోదరి చెల్లించింది.. కాబట్టి ఇది సహేతుకమైదే.. కానీ, బెంగళూరులో విద్య చాలా ఖరీదైనదిగా మారుతోంది అని వెల్లడించాడు.
Read Also: Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన.. రెండు రోజులుగా కనిపించట్లేదని నెట్టింట చర్చ
అలాగే, మరొక యూజర్ “ఇంత అధిక ఫీజులు ఉన్నప్పటికీ, చాలా మంది వాటిని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. నిజానికి, సాధారణ ప్రీ-స్కూల్స్‌లో చేరిన పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారని తెలిపాడు. ఇంకో నెటిజన్, నా అభిప్రాయంలో ఇది చాలా ఎక్కువ.. ప్రీ-స్కూల్ కోసం రూ. 2 లక్షలు వసూలు చేస్తూ.. ఏబీసీడీలు, 123లు ఎందుకు నేర్పిస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. పైగా పిల్లలు పై తరగతులకు వెళ్ళే కొద్దీ ఈ ఫీజులు ఇంకా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.