Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..
- బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..
- అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని, సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్‌లో శాశ్వత శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్‌లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గో గేట్ ప్రారంభించిన సందర్భంగా అమిత్ చేశారు. 2026లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు.
Read Also: Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?
Also Read
“సరిహద్దులు దాటడానికి చట్టబద్ధమైన మార్గం లేనప్పుడు, అక్రమ వలసలు జరుగుతాయి. అక్రమ వలసలు ఇండో-బంగ్లాదేశ్ శాంతికి హాని కలిగిస్తాయి. నేను బెంగాల్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, 2026 లో బీజేపీని గెలిపించండి. చొరబాట్లను మేము ఆపేస్తాం. చొరబాట్లు ఆగితేనే బెంగాల్‌లో శాంతి నెలకొంటుంది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్ట్‌లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరియు సంబంధాలను మెరుగుపరచడంలో ల్యాండ్ పోర్ట్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు.
బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోడీ పంపిన నిధులను తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. నరేంద్రమోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 56,000 కోట్లు ఇచ్చారని, ఈ నిధులు టీఎంసీ చేతుల్లో వెళ్లాయా..? దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026లో రాజకీయ మార్పు తీసుకురావాలని అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..