Bangladesh: బంగ్లాదేశ్‌కు చైనా యుద్ధ విమానాలు.. భారత్‌కు సవాలేనా.?
- 24 చైనా జే-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలుకు బంగ్లాదేశ్ సిద్ధం.
- పాకిస్థాన్ వద్ద ఇప్పటికే ఈ ఫైటర్ జెట్లు..
- బంగ్లాదేశ్ వైమానిక దళానికి భారీ సామర్థ్య పెరుగుదల.
- భారత్‌కు తక్షణ ముప్పు లేకపోయినా చైనా ప్రభావం పెరిగే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనా తయారీ యుద్ధ విమానాలైన J-10CE ఫైటర్ జెట్లు 24 కొనుగోలు చేసే ప్లాన్ చేస్తోంది. ఆగస్టు నాటికి ఈ డీల్‌పై చైనా-బంగ్లాదేశ్ సంతకాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ డీల్ ఓకే అయితే బంగ్లాదేశ్ వైమానిక దళ సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే, ఇది భారత్‌కు ప్రమాదకరంగా మారింది. భారత సరిహద్దు దేశంలో చైనా ప్రాబల్యం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. J-10C ఎగమతి వెర్షన్‌గా J-10CE ఫైటర్ జెట్ ఉంది. ఇది 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ప్రస్తుతం పాక్ దీనిని వినియోగిస్తోంది.
ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే:
బంగ్లాదేశ్ “ఫోర్సెస్ గోల్ 2030″లో భాగంగా సైనిక ఆధునీకీకరణలో ఈ కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద పాత తరం చైనా ఎఫ్-7 యుద్ధ విమానాలు, రష్యా మిగ్-29 విమానాలు ఉన్నాయి. J-10CE ఫైటర్ జెట్ WS-10B ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో నడుస్తుంది. మాక్ 1.8 వేగాన్ని అందుకోగలదు. డెల్టా వింగ్ డిజైన్, కెనార్డ్ ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ ఈ విమానంలో ఉంది. డాగ్ఫైట్లలో, క్షిపణుల నుంచి తప్పించుకునే సమయంలో మెరుగైన చురుకుదనం ఈ విమానం సొంతం.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
ఈ ఫైటర్ జెట్ 11 హార్డ్ పాయింట్ల ద్వారా ఎయిర్ టూ ఎయిర్ క్షిపణుల్ని, బాంబుల్ని, అత్యంత ఖచ్చితత్వంతో ప్రయోగించగలదు. 5600 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలదు. దీనిలో అధునాతనమైన AESA రాడార్, శత్రువుల జామింగ్ ప్రయత్నాలనున అడ్డుకుంటుంది. ఒకే సారి అనేక లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేసే సత్తా దీనికి ఉంది. చైనీస్ తయారీ లాంగ్ రేంజ్ మిస్సైల్ PL-15ను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
బంగ్లాదేశ్ సైన్యానికి కొత్త శక్తి:
బంగ్లాదేశ్ 40 నుంచి 44 విమానాలు కలిగిన చిన్న ఎయిర్ ఫోర్స్ ఉంది. ఇందులో దాదాపుగా 36 విమానాలు పాతబడిపోయాయి. ఈ డీల్ కుదిరితే బంగ్లాదేశ్ దళానికి కొత్త హంగులు చేకూరుతాయి. దీని ధర ఒక్కొక్కటికి 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కాన్ఫిగరేషన్ బట్టి ఒక్క యూనిట్ ధర 120 మిలియన్ డాలర్లు వరకు ఉండొచ్చు. రఫెల్, ఎఫ్-16తో పోలిస్తే బంగ్లాదేశ్‌కు తక్కువ ధరకే ఈ చైనీస్ యుద్ధ విమానాలు లభిస్తున్నాయి.
భారత్‌కు సవాలేనా.?
అయితే, ఈ కొనుగోలుతో భారత్‌కు ఇప్పటికిప్పుడు సమస్యలు లేవు. భారత వైమానిక దళం తూర్పు వైపు ఇప్పటికే సుఖోయ్ సు-30, రఫెల్ వంటి యుద్ధ విమానాలను మోహరించింది. సుమారు నాలుగు యుద్ధ విమాన స్క్వాడ్రన్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీటి మొత్తం సంఖ్య దాదాపు 60-70. బంగ్లాదేశ్ చైనీస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పటికీ, భారత్ శక్తితో పోటీ పడలేదు. జే-10సీఈ ద్వారా పీఎల్-15 ఎయిర్ టూ ఎయిర్ క్షిపణుల్ని కలిగి ఉన్నప్పటికీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఈ క్షిపణుల్ని కుప్పకూల్చింది. అయినప్పటికీ, ఈ డీల్ ద్వారా యుద్ధ విమానాల మెయింటనెన్స్ వంటి వాటికి బంగ్లాదేశ్ చైనాపై ఆధారపడి ఉంటుంది. తరుచుగా ఆ దేశానికి చెందినవారు బంగ్లాదేశ్‌కి వస్తారు. ఇది భారత్‌పై నిఘాకు ఉపయోగపడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!