Bangladeh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో మతోన్మాదులు, భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు కూడా గెలుపొందారు. ఇందులో ఇద్దరు అధికారం చేపట్టబోయే బీఎన్పీ పార్టీ నుంచి గెలుపొందారు. ఒకరు జమాతే ఇస్లామీ నుంచి గెలిచారు. షేక్ హసీనా పాలన సమయంలో వీరి ముగ్గురిపై మరణశిక్షతో సహా అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే, మహ్మద్ యూనస్ తాత్కాలిక పాలకుడయ్యాక వీరిపై ఉన్న అన్ని ఆరోపణల్ని తొలగించాడు.
బీఎన్పీ నాయకుల్లో ఇద్దరు లుట్పోజ్జామాన్ బాబార్, అబ్దుస్ సలాం పింటు, జమాతే నుంచి ఏటీఎం అజరుల్ ఇస్లాం గెలుపొందారు. భారత వ్యతిరేకత కలిగిన వీరు ఇప్పుడు బంగ్లా పార్లమెంట్‌కు వెళ్తున్నారు. ఆగస్టు 21, 2004న షేక్ హసీనాను లక్ష్యంగా చేసుకుని జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించిన రెండు కేసుల్లో తారిక్ రెహమాన్, లుట్ఫోజ్జామాన్ బాబర్, ఇతరులను డిసెంబర్ 2024లో, బంగ్లాదేశ్ హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ ఘటనలో హసీనా తృటిలో తప్పించుకున్నారు. 24 మంది మరణించారు.ః
Read Also: Ireland vs Oman: ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్
ఇక బీఎన్పీ నేత అబ్దుస్ సలాం పింటు భారత్ దృష్టిలో చాలా ముఖ్యం. ఇతడికి కూడా యూనస్ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2006లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని కోర్టు ఆవరణలో, 2007లో అజ్మీర్ షరీఫ్ దర్గాలో మరియు 2011లో ఢిల్లీలో జరిగిన పేలుళ్లతో సహా భారతదేశంలో జరిగిన దాడులకు వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి (హుజీ)కి పింటు మద్దతు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. పింటు 2 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.
మూడో వ్యక్తి ఏటీఎం అజరుల్ ఇస్లాం, దీర్ఘకాలికంగా జమాత్ పార్టీలో పనిచేస్తున్నాడు. 1971 విముక్తి యుద్ధంలో 1200 మందికి పైగా మరణాలు, 13 అత్యాచార కేసులో ఇతను నిందితుడు. 2014లో ఇతడికి మరణశిక్ష విధించారు. యూనస్ సర్కార్ ఇతడిని కూడా నిర్దోషిగా విడుదల చేసింది. ఇవన్నీ ఒక వైపు ఉంచితే, ప్రస్తుతం తారిఖ్ రెహ్మాన్ బంగ్లా ప్రధాని కాబోతున్నారు. భారత్ సంబంధాల దృష్ట్యా ఇతని ఎన్నిక కీలకంగా మారింది. రానున్న కాలంలో భారత్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.