Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..
- బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్..
- ఇద్దరు చిన్నారులపై నిందితుడి అత్యాచారం..
- గత నెలలో మహారాష్ట్రలో సంచలనంగా మారిన ఘటన..
- పారిపోతున్న క్రమంలో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు..
- నిందితుడు అక్షయ్ షిండే మృతిపై రాజకీయ దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badlapur encounter: బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికను లైంగికంగా వేధించిన స్వీపర్ అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ లైంగిక వేధింపుల ఘటన ఆగస్టులో బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర నిరసనకు కారణమైంది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో పొలిటికల్ వార్‌కి దారి తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఈ ఎన్‌కౌంటర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఘటన జరిగిన స్కూల్ బీజేపీ నాయకుడి యాజమాన్యంలో ఉందనే రుజువల్ని నాశనం చేయడానికి ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి ఎలా కాల్పులు జరిపాడని ప్రశ్నించారు. ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ రోజు మహారాష్ట్రలో చట్టం అమలు, న్యాయవ్యవస్థ పూర్తిగా విచ్చినమైందని అన్నారు. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ దీనిని ‘‘మహారాష్ట్ర పోలీసులకు బ్లాక్ డే’’గా అభివర్ణించారు. అది ఎన్‌కౌంటర్ అని ఎవరూ నమ్మరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చవాన్ డిమాండ్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులు ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని షిండే తల్లిదండ్రులు అన్నారు. తన కొడుకు క్రాకర్స్, రోడ్డు దాటడానికి కూడా భయపడుతాడని, అలాంటి వాడు ఎలా పోలీసులపై కాల్పులు జరుపుతాడంటూ ప్రశ్నించారు.
అయితే, ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ, అధికార శివసేన ఘాటుగా స్పందించాయి. అత్యాచార నిందితుడికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై దాడి చేశాడు, అయినా కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అక్షయ్ షిండేను ఉరితీయాలని ప్రతిపక్షాలే డిమాండ్ చేశాయి, ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నారని శివసేన ఎంపీ నరేష్ మాస్కే అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రతిపక్షాల విమర్శలపై ధ్వజమెత్తాడు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వ లడ్కీ బహిన్ పథకం విజయవంతం కావడంతో భయపడుతున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!