Eknath Shinde: ఆటోరిక్షా మెర్సిడెజ్‌ను వెనక్కి నెట్టేసింది.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విమర్శల వర్షం కురిపించారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు నేతలకు నాయకత్వం వహిస్తున్నపుడు కొంత మంది సేన నాయకులు ఆటోరిక్షా డ్రైవర్ అని ఎగతాళి చేశారని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ఆటోరిక్షానే మెర్సిడెజ్‌ను వెనక్కి నెట్టిందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వమని భావించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
బీజేపీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని త్రీవీలర్ ప్రభుత్వం అని పిలిచేదని, అయితే ఇప్పుడు త్రీవీలర్ నడిపిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని అన్నారు. షిండే తనను వెన్నుపోటు పొడిచారని కూడా ఠాక్రే ఆరోపించారని ఆయన వెల్లడించారు. షిండే శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. తన ప్రారంభ రోజుల్లో సీఎం షిండే జీవనోపాధి కోసం ఆటో రిక్షా నడిపారు.ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు ఉద్ధవ్ ఠాక్రే మెర్సిడెస్ కారులో రాజ్‌భవన్‌కు వచ్చారు. దీంతో మెర్సిడెస్ కారును ఆటోరిక్షా అధిగమించిందని సీఎం షిండే మరాఠీలో ట్వీట్ చేశారు.
Also Read
అధికారం కోసం బీజేపీ ఏదైనా చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ ఈ 50 మంది హిందుత్వ వైఖరిని, సైద్ధాంతిక వైఖరిని తీసుకున్నారని.. వారి ఎజెండా అభివృద్ధి , హిందుత్వమేనని దేశానికి నిరూపించారన్నారు. బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి తమకు మద్దతు ఇచ్చారని షిండే అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ తనకు చెప్పారని షిండే చెప్పారు. అభివృద్ధి పనులకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తాము చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని.. ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరిందన్నారు.
Vijay Vasanth Pen: నా.. పెన్ను పోయింది ! పోలీస్టేషన్‌లో కేసుపెట్టిన ఎంపీ.. దాని విలువ ఎంతంటే?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లు గెలుచుకుంటుందన్న వ్యాఖ్యలపై షిండేను ప్రశ్నించగా, 170 మంది ఎమ్మెల్యేలు కూటమితో ఉన్నారని, ఇంకా 30 మంది మాత్రమే మిగిలి ఉన్నారని అన్నారు. 200కు పైగా సీట్లు తెచ్చుకోగలం అని అన్నారు. భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ గొప్ప మనస్సుతో ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం అనూహ్యమని.. తాను అధిష్ఠానం ఆదేశాలను పాటించారన్నారు. మంత్రివర్గ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..