పెన్ను పోయిందంటూ పోలీస్ స్టేషన్ ఓ ఎంపీ కేసు పెట్టడం పై చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అయి వుండి పెన్ను పోయిందని కేసుపెట్టడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా అంత చిన్న పెన్ను కోసం పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తున్నారా.. ఆ పెన్ను విలువ రూ. లక్షా 50 వేలపై మాటేనండీ. అంతేకాదు.. పైగా ఆ పెన్ను.. మరణించిన తన తండ్రి జ్ఞాపకం అందుకే దాని కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఎంపీ.
read also: Agnipath: నేవీ అగ్నివీర్ సైలర్ పోస్టుల్లో 20 శాతం మహిళలే..
అయితే.. కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన తండ్రి జ్ఞాపకంగా ఉంచుకున్న పెన్ను అదృశ్యం కావడంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.1.50 లక్షల విలువైన పెన్ను కనిపించకుండా పోవడంపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు చెన్నైలోని గిండీలోని నక్షత్ర హోటల్‌లో స్వాగతం పలికిన.. ఇందులో డీఎంకే కూటమి పార్టీలు పాల్గొన్నాయి. అంతేకాదు..ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యుల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ ఎం.పి. విజయ్ వసంత్ హాజరయ్యారు. అనంతరం ఆ.. తర్వాత విజయ్ వసంత్‌కు చెందిన రూ.1.50 లక్షల విలువైన పెన్ను కనిపించకుండా పోయింది. అయినా పెన్ పోయింది బయటకాదు.. సమావేశంలో..? అయితే అక్కడంతా కాంగ్రెస్ సభ్యులే అంతా వున్నారు. మరి ఆపెన్నును తీసేంతగా ఎవరికి ఆస్కారం వుందని పలువురు అంటున్నారు. అందుకే అంటారు ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని. ఏది ఏమైనా పోలీసులు ఎంపీ పెన్ వెతికే పనిలోపడ్డారు.