AAP: ఆప్‌కి మరో షాక్.. పరువునష్టం కేసులో మంత్రి అతిషీకి కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ లిక్కర్ కేసు, స్వాతి మలివాల్‌పై దాడి కేసుల్లో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో షాక్ తగిలింది. ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసింది. లంచం ఇచ్చి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆమె ఆరోపించింది. దీనిపై ఢిల్లీ బీజేపీ మీడియా హెచ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. జూన్ 29న కోర్టు ముందు హాజరుకావాలని అతిషీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా చేర్చిన ప్రవీణ్ శంకర్ కపూర్.. ఈ ఆరోపణలు తన పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతిషీని నిందితురాలిగా గుర్తించి, జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Smartphone Theft: మీ ఫోన్ ఎవరైనా కొట్టేశారా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు తగిన ఆధారాలు చూపించ లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 30న బీజేపీ పరువునష్టం కేసును దాఖలు చేసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ని బీజేపీ కేసులో పేర్కొంది. బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, పార్టీ మారేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందన ఆయన ఆరోపించారు. ఆప్ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. తనను పార్టీ మారడానికి బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, లేని పక్షంలో ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమె ఆరోపించారు. బీజేపీ సన్నిహితులు తనను సంప్రదించారని, వారు నన్ను బీజేపీలో చేరాలని కోరారని, ఇది తన రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారని, మారకపోతే ఈడీ నెల రోజుల్లో తనను అరెస్ట్ చేస్తుందని బెదిరించారని ఆమె ఏప్రిల్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్ కూడా త్వరలో అరెస్ట్ చేయబడుతారని ఆమె పేర్కొంది. అతిషి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, టీవీ, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు తన పిటిషన్లో కోరారు.
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!