Atiq Ahmed Ashraf shot from point blank range: గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి మెడికల్ చెకప్ కోసం ఈ ఇద్దరిని తీసుకెళ్తుండగా.. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ధూమంగంజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్లిద్దరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సోదరులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు వెంటనే కాల్పులు జరిపిన హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే.. ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. నిందితులను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు.
Raghunandan Rao: రిజర్వేషన్‌లు ఇవ్వని కేసీఆర్‌కు.. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు
కాగా.. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసుతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్యకేసులోనూ అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌తో పాటు మరో నిందితుడైన అతని స్నేహితుడు గులామ్‌ను ఏప్రిల్ 13వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఝాన్సీ సమీపంలో ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే! అతీక్ అహ్మద్‌కి మొత్తం ఐదుగురు కొడుకులు ఉండగా.. అసద్ వారిలో మూడోవాడు. కాగా.. పక్కా ప్లాన్‌తోనే అతీక్, ఆయన సోదరుడు అష్రఫ్‌లపై కాల్పులు జరిపి హతమార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..