Covid-19 Vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై దావా వేయాలని యోచిస్తున్నారు. ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాలు ఉంటాయని అంగీకరించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసింది. 2021లో తమ 20 ఏళ్ల కూతురు కారుణ్యను కోల్పోయామని వేణుగోపాల్ గోవిందన్ చెప్పారు.
జూలై 2021లో కారుణ్య వేణుగోపాల్ అనే 20 ఏళ్ల డేటా సైన్స్ స్టూడెంట్ టీకా తీసుకున్న ఒక నెల తర్వాత మరనించింది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత ఆమె మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పారు.
Read Also: Malavika Jayaram : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం ..ఫోటోలు వైరల్..
రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు దాని వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని ఆన్‌లైన్ పోస్టులో పేర్కొన్నారు. ప్రజారోగ్యం పేరుతో జరిగిన దురాగతం పునారావృతం కాకుండా నిరోధించడానికి తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని ఆయన పోస్టులో వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా నిందించారు.
2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ, శ్రీగోవిందర్ కుమార్తెల మరణాలపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాకలు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే UKలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది, దాని టీకా అనేక సందర్భాల్లో మరణాలు మరియు తీవ్ర గాయాలకు కారణమైందని కనీసం 51 కేసుల వచ్చాయి. ఈ టీకా వల్ల థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే సైడ్ ఎఫెక్ట్‌కి కారణమవుతుందని ఆస్ట్రాజెనికా ఇటీవల చెప్పింది. దీని వల్ల రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కి కారణమవుతోంది.
Thanks to @Teensthack for this article. 🙏
I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭
Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM
— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024