Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Need For Population Control says Asaduddin Owaisi: దేశంలో ఇప్పటికే రీప్లేస్మెంట్ రేటు సాధించిందని.. జనాభా నియంత్రణ అవసరం లేదని ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. హిందువులు, ముస్లింలకు ఒకే డీఎన్ఏ ఉంటే అసమతుల్యత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వృద్ధాప్య జనాభా, వృద్ధులను ఆదుకోలేక నిరుద్యోగ యువత ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. సంతానోత్పత్తి రేటు ముస్లింలతో తీవ్రంగా క్షీణించిందని ఆయన అన్నారు.
మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను విద్వేశ వ్యాఖ్యలుగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. విద్వేశపూరిత వార్షిక దినంగా ఆయన ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాన్ని అభివర్ణించారు. ‘‘ జనాభా అసమతుల్యత’’పై భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మారణహోమానికి దారి తీశాయని అన్నారు. జాతి ప్రక్షాళన, ద్వేషపూరిత నేరాలకు దారి తీశాయని.. సెర్బియాలో జాతీయవాదులు అల్బేనియన్ ముస్లింల మారణహోమం తరువాత కొసావో దేశం ఏర్పడిందని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
Also Read
Read Also: kabul Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
బుధవారం నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ తన వార్షిక దసరా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ జనాభా నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మతాల జనాభా అసమతుల్యతను విస్మరించొద్దని అన్నారు. జనాభా నియంత్రణ విధానాలకు పిలుపునిచ్చారు మోహన్ భగవత్. జనాభా అసమతుల్యత దేశవిభజనకు దారితీసే అవకాశం ఉందని.. కసావో, దక్షిణ సూడాన్ వంటి దేశాలు జనాభా అసమతుల్యత కారణంగా ఏర్పడినవే అని ఉదహరించారు. జనాభా నియంత్రణ కోసం అందరికి సమానంగా వర్తించే విధానం అవసరమని ఆయన అన్నారు. జనాభా అసమతుల్యత వల్ల దేశంలో భౌగోళిక సరిహద్దుల్లో మార్పు వస్తుందని అన్నారు.
ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ వరసగా ముస్లిం మేధావులు, మత గురువులతో సమావేశం అయ్యారు. దేశంలో శాంతి సామరస్యాల గురించి వారితో చర్చించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మోహన్ భగవత్ జనాభా నియంత్రణపై మాట్లాడారు. బలవంతంగా మతం మార్చడం, ప్రలోభపెట్టి మతాన్ని మార్చడం, చొరబాట్లు జనాభా అసమతుల్యతకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. తాజాగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్‌ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!