Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు
- కీలక ప్రభుత్వ సంస్థలకు ఈ-మెయిల్స్ బెదిరింపులు
- ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కీలక ప్రభుత్వ సంస్థలకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ఐఏ, ఇస్రో, డీఆర్డీవో, ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు సంస్థలకు పంపిన బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టగా ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 36 ఏళ్ల వ్యక్తి 2008 నుంచి మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
జూన్ 29న పంపిన ఈ-మెయిళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాలతో సహా పలు అత్యంత భద్రతా సంస్థలలో బాంబులు ఉన్నాయని పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
ఇక బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందిన వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు వెంటనే ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. కార్యాలయం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!