War 2 : భారీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మాస్ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. దసరా హాలీడేస్ ఉండడం.. పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడంతో దేవరకు తిరుగులేకుండా పోయింది. ఇక ఓ వైపు థియేటర్లో దేవర దండయాత్ర జరుగుతుంటే.. మరోవైపు ఎన్టీఆర్ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ఎన్టీఆర్ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పై పలు కీలక యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.
Read Also:Narhari Zirwal: భవనంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!
Also Read
అయితే.. అంతకంటే ముందు ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ఒక మాస్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ సెట్ కూడా వేసినట్టుగా సమాచారం. ఈ పాట కోసం అక్టోబర్ మూడో వారంలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడట. ఈ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారట. సినిమాకే ఈ సాంగ్ హైలెట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హీరోల టాప్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే.. ఎన్టీఆర్, హృతిక్ టాప్‌లో ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి మాస్ సాంగ్ అంటే.. థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.
Read Also:Vishwambhara : రెండు పాటలు తప్పా మిగతా అంతా కంప్లీట్.. విశ్వంభర లేటెస్ట్ అప్డేట్
- Tags
- Devara
- hruthik roshan
- ntr
- War 2
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!