ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు. మూడు రోజుల కిందట ఢిల్లీలోని యాక్టివ్ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా కేసులు నమోదైతే.. ఆ మర్నాడు డిసెంబర్ 30న 1,313 కేసులు, డిసెంబర్ 31న 1,796 కేసులు వచ్చాయని తెలిపారు. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 2,716కు పెరిగాయన్నారు. ఇవాళ 3,100 కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు.
Read Also: ఆర్కే బీచ్లో విషాదం.. ఒకరు మృతి
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
కేసులు పెరుగుతున్నా కరోనా బారిన పడినవారు ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు తక్కువేనన్నారు. నిన్న ఆసుపత్రుల్లో కేవలం 246 మంది చేరారన్నారు. 82 మంది పేషెంట్లకే ఆక్సిజన్ బెడ్లు అవసరమయ్యాయని చెప్పారు. థర్డ్ వేవ్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 37 వేల బెడ్లు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని కేజ్రీవాల్ సూచించారు.
తాజావార్తలు
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!