ఆర్కే బీచ్‌లో విషాదం.. ఒకరు మృతి

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. విహారం కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిలో సముద్రంలో గల్లంతు అవ్వడం తోటి వారిని కలిచి వేసింది.విహారం కోసం వచ్చిన వారిలో సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒడిశాకు చెందిన ఐదుగురు బీచ్‌లో స్నానానికి దిగగా వారిలో సునీత త్రిపాఠి అనే యువతి మృతి చెందింది. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

Read Also: మద్యం సేవించొద్దన్నందుకు వ్యక్తులపై దాడి.. ఒకరు మృతి

హైదరాబాద్ బేగంపేట ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది విశాఖ వచ్చారు. బీచ్‌లో దిగిన ఎనిమిది మందిలో ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో కే. శివ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.సిహెచ్ శివకుమార్, మహమ్మద్ అజీజ్ కోసం గాలిస్తున్నారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన వారిలో ఇద్దరూ యువకులు, మరోయువతి ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొత్త ఏడాదిలోనే ఘటన జరగడంతో అందరూ దిగ్ర్భాంతికి లోనయ్యారు.

Related Articles

Latest Articles