Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఉచిత హామీలు, పథకాలపై బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కార్పొరేట్ సంపన్నుల రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. బియ్యం, గోధుమలు కొనుగోలు చేసే నిరుపేద కూడా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. 2014లో కేంద్ర బడ్జెట్ రూ 20 లక్షల కోట్లు.. అది ఇప్పుడు రూ.40లక్షల కోట్లకు చేరిందని.. అందులో రూ.10లక్షల కోట్లు సంపన్నుల రుణమాఫీ చేయడానికే కేంద్రం ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. పెద్దపెద్ద కంపెనీలకు కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేసిందన్న కేజ్రీవాల్ .. అలాంటి రుణాలను మాఫీ చేయకుంటే పేద ప్రజల అన్నంపై పన్నులు విధించే పరిస్థితి వచ్చేదే కాదని కేంద్రంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. అలా అత్యంత పేదలపైనా పన్నుల భారం మోపుతోందంటే కేంద్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Venkaiah Naidu : అయితే ప్రెసిడెంట్, లేదా డిసిడెంట్.. ఇది నా నైజం కాదు
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గింపు, ఆహారోత్పత్తులపై జీఎస్టీ, జాతీయ ఉపాధి హామీ పధకంలో 25 శాతం కోత విధించడం ద్వారా సమకూరిన నిధులు ఏమవుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని.. మరోవైపు సైనికులకు పింఛన్లు చెల్లించేందుకు కూడా నిధుల లేమిని సాకుగా చూపుతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. తమ అగ్నిపథ్ యోజనను సమర్థిస్తూ, రక్షణ సిబ్బందికి ఇకపై పింఛన్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే వాటిలో కొంత మాత్రమే రాష్ట్రాలకు ఇస్తుందని కేజ్రీవాల్ వెల్లడించారు. అంతకుముందు రాష్ట్రాలకు 42శాతం ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు అది దాదాపు 29 నుంచి 30శాతానికి పడిపోయిందన్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు రెండు, మూడు రెట్లు అదనంగా పన్నులను కేంద్రం వసూలు చేస్తోందని… ఆ డబ్బంతా ఎక్కడికి పోతోందని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!