Kejriwal: జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర
- కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ
- రాజీనామాకు గల కారణాలతో లెటర్
- ఇంటింటికీ పంపిణీ చేయనున్న కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైల్లో తనను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. పార్టీ ప్రజా ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు నిరాకరించారని.. సకాలంలో ఇంజెక్షన్ తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తీహార్ జైల్లో చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్ పథకం ఎత్తేస్తారన్నారు. పదేళ్లుగా ఢిల్లీ అభివృద్ధి పనులను బీజేపీ నిలిపివేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Iddaru: రిలీజ్‌కు రెడీ అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ చివరి సినిమా.. ఎప్పుడంటే?
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
ఇక తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఢిల్లీలో ప్రజల కోసం పనిచేస్తున్నందున తనను జైలుకు పంపారని తెలిపారు. తాను బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పగిలిన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు శుభ్రం చేయడం, నీటి సరఫరా నిరాంతరాయంగా ఆప్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Viral News: ఏఐ ద్వారా సీవీని రూపొందించిన నిరుద్యోగి.. దాన్ని చూసి కంపెనీ సీఈవో షాక్..
ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖను ఆప్ కార్యకర్తలు అక్టోబర్ 29 వరకు 70 నియోజకవర్గాల్లోని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం కోసం ప్రణాళికలు రచిచూస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టారు. ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషిని ముఖ్యమంత్రిని చేశారు.
తాజావార్తలు
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!