Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్‌ఆర్‌కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.