Katchatheevu: “కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..
- కచ్చతీవు దీవులపై ఇందిరాగాంధీపై ప్రశంసలు..
- కాంగ్రెస్ నేత తీరుని ప్రశ్నించిన అన్నామలై..
- తమిళనాడులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు డీఎంకేల ఏకపక్ష, పేలవమైన ఆలోచన రహిత నిర్ణయాలని అన్నామలై విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా తమిళ జాలర్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని దుయ్యబట్టారు. ఎక్స్‌లో కాంగ్రెస్, డీఎంకేలపై విరుచుకుపడ్డారు. ‘‘ కాంగ్రెస్, డీఎంకేల నిర్ణయం మన మత్స్యకారుల ప్రాణాలను బలిగొందని, నిరంతరం అరెస్టులు, మన ఫిషింగ్ బోట్లకు నష్టం కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని సెల్వపెరుంతగై గ్రహించారా..?’’ అని ప్రశ్నించారు.
Also Read
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
మనదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ప్రధాని నరేంద్రమోడీ అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని అన్నామలై ఆరోపించారు. కచ్చతీవు దీవుల విషయంలో కాంగ్రెస్ నాయకుడి వైఖరిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు.
1974 ఇండో-శ్రీలంక సముద్ర ఒప్పందం ప్రకారం శ్రీలంకకు అప్పగించబడిన 285 ఎకరాల జనావాసాలు లేని ద్వీపమైన కట్చతీవు వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది, ముఖ్యంగా తమిళనాడులో, ఈ చర్య తమిళ జాలరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు నిరంతరం విమర్శిస్తున్నాయి. ఈ దీవిని శ్రీలంకకు అప్పగించడం ద్వారా మన వ్యూహాత్మక అవసరాలు దెబ్బతిన్నాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తారు.
తాజావార్తలు
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్‌కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..