Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- మహిళ సల్వార్ తొలగించడం, ఛాతీని నొక్కడం మాత్రమే అత్యాచారయత్నం కాదు..
- అత్యాచారానికి స్పష్టమైన ఆధారాలు అవసరం..
- పాట్నా హైకోర్టు వివాదాస్పద తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patna High Court: అత్యాచారయత్నంపై పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. మహిళ సర్వార్ తొలగించడం, ఛాతీని నొక్కడం వంటి చర్యలు మాత్రమే అత్యాచారయత్నానికి స్పష్టమైన ఆధారాలుగా పరిగణించలేమని చెప్పింది. స్పష్టమైన ఆధారాలు లేకపోతే దానిని ‘‘అత్యాచాయత్నం(Attempt to Rape)గా పరిగణించలేమని కోర్టు తీర్పు చెప్పింది. 2008లో బీహార్‌లోని బాంకా జిల్లాలో నమోదైన కేసులో దోషిగా తేలిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా జస్టిస్ పూర్ణేందు సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రయల్ కోర్టు అత్యాచారయత్నం, అక్రమ నిర్భందం కింద విధించిన శిక్షల్ని హైకోర్టు రద్దు చేసింది.
ఈ కేసు విషయానికి వస్తే.. ఫోటో తీయించుకునేందుకు స్టూడియోకు వెళ్లిన మహిళను స్టూడియో యజమాని గదిలో బంధించి, ఆమె సల్వార్ తొలగించే ప్రయత్నం చేసి, ఛాతీని నొక్కాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫోటో తీసిన తర్వాత, స్టూడియో యజమాని కంప్యూటర్లో ఫోటో చూపిస్తానన్న నెపంతో ఆమె తండ్రిని బయట వేచి ఉండమని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత నిందితుడు స్టూడియో తలుపుకు తాళం వేసి, ఆ మహిళ సల్వార్‌ను తొలగించడానికి ప్రయత్నించి, అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఛాతీపై నొక్కాడని ప్రాసిక్యూషన్ తెలిపింది. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె తండ్రి అక్కడికి చేరుకునే లోగా నిందితుడు పరారయ్యాడు. అయితే, ఈ కేసులో అత్యాచారానికి ప్రయత్నించినట్లు నిర్ధారించే వైద్య ఆధారాలు, అత్యాచార చర్యకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన సాక్ష్యాలు లేవని హైకోర్టు గుర్తించింది. దీంతో అత్యాచార కేసు నుంచి నిందితుడికి విముక్తి లభించింది.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
అయితే, నిందితుడి చర్యలు మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా, అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ, ఇవి ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై అసభ్య దాడి/గౌరవానికి భంగం కలిగించడం) పరిధిలోకి రావచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. చివరగా నిందితుడిపై మోపబడ్డ అభియోగాలను, కింది కోర్టు విధించిన శిక్షల్ని హైకోర్టు రద్దు చేసింది.
తాజావార్తలు
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!