ఆనంద్ మహీంద్రా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇండియాలోనే రిచ్చెస్ట్ పర్సన్స్ లో ఒకరు. మహీంద్రా గ్రూప్ అధినేత. నిత్యం బిజినెస్ వ్యవహారాల్లో ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో పలు అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. ఇటీవల తను మాట ఇచ్చినట్లుగా తమిళనాడులో ఇడ్లీలు అమ్ముకునే ఓ వృద్దురాలి సొంతంగా ఇళ్లు కూడా కట్టించారు. 85 ఏళ్ల వయసులో కూడా కేవలం రూ.1 ఇడ్లీ అమ్ముతున్న ఈ అమ్మ విషయం తెలుసుకుని సొంతంగా ఇళ్లు, అందులోనే హోటల్ ఉండేలా ఇళ్లు కట్టించి అందరి మనసులను గెలుచుకున్నారు.
తాజాగా థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టును ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇండియా పురుషుల బ్యాట్మింటన్ టీం ఇటీవల ఇండోనేషియాను ఓడించి కప్ గెలిచింది. ఈ సందర్భంలో భారత్ సాధించిన విజయంపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే థామస్ కప్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన చిరాగ్ శెట్టి స్పందిస్తూ… ధన్యవాదాలు తెలపడమే కాదు.. తాను ఇటీవల మహీంద్ర ఎస్‌యూవీ 700 కారు బుక్ చేశానని, కాస్త తొందరగా డెలివరీ చేయాలని ఫన్నీగా ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో రిప్లే ఇచ్చారు. ఛాంపియన్‌ల ఎంపికగా మారిన ఎస్‌యూవీ 700ని వీలైనంత త్వరగా మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయితే నా ‘భార్య కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేసానని… నేను ఇప్పటికే క్యూలోనే ఉన్నాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.
మహీంద్రా కొత్తగా తీసుకువచ్చన ఎస్‌యూవీ 700 కార్ కు తెగ క్రేజ్ ఏర్పడింది. పుల్లీ ఆటోమేటిక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వస్తున్న ఈ కార్ కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇటీవల చిప్ సెట్ల కొరత కారణంగా కార్ డెలవరీ లేట్ అవుతోంది. బుకింగ్ చేసుకున్న తరువాత మూడు నుంచి 6 నెలల సమయం పడుతోంది డెలవరీకి.
Since that makes the XUV7OO the Choice Of Champions we will have to work extra hard to get it to you ASAP. @vijaynakra I hope you see this! (By the way, I’ve ordered one for my wife & I’m still in Q! ) Sadly, the global supply chain disruptions are plaguing all car companies) https://t.co/q4sYqq1XR8
— anand mahindra (@anandmahindra) May 17, 2022