ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం 'క్షమించండి' అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
Tamil Nadu BJP: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా "సైలెంట్ ఆపరేషన్" నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు.
తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాజకీయ అనుభవం, నైపుణ్యం బీజేపీకి కీలకంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం, 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ, పార్టీకి మద్దతుగా నిలిచారు.