Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
- అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ
- ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
- మోడీ-ట్రంప్ భేటీ మరుసటి రోజే కలవడంపై సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ, సరిహద్దు భద్రత, నేరస్తులపై సంయుక్త చర్యలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం ఫ్రాన్స్‌లోని జీ 7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన మరుసటి రోజే జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
భేటీ అనంతరం సెర్జియో గోర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘హోంమంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాలు, అక్రమ డ్రగ్స్ నుంచి ప్రజలను రక్షించడం, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడం, రెండు దేశాల్లో నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో సహకారాన్ని మరింత పెంచే అంశాలపై ఫలవంతమైన చర్చ జరిగింది” అని పేర్కొన్నారు.
జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో సమావేశమైన మోడీ.. భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలపై కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అభినందించినట్లు మోడీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అత్యంత కీలకమని, సముద్రయాన సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు.
ఇదిలా ఉండగా గత నెల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక ఖనిజాలు, సరఫరా గొలుసులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి అనేక అంతర్జాతీయ అంశాల్లో భారత్, అమెరికా వ్యూహాత్మకంగా ఒకే దిశలో ఉన్నాయని పేర్కొన్నారు. “ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో భారత్ ఒకటి. ఉగ్రవాదం కారణంగా ఇరు దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయాయి. అందువల్ల ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్-అమెరికా మధ్య బలమైన సమన్వయం ఉంది” అని మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాల నియంత్రణ వంటి అంశాల్లో భారత్-అమెరికా సహకారం మరింత బలోపేతం కానున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
Had an excellent meeting with Honorable Home Minister @AmitShah. We had a fruitful discussion on enhancing collaboration to combat terrorism, shield our people from narcotics and illicit drugs, secure our borders, and jointly bring criminals to justice in both nations. pic.twitter.com/ePC0dHQZ0X
— Ambassador Sergio Gor (@USAmbIndia) June 18, 2026
- Tags
- Amit Shah
- india
- Sergio Gor
- us
తాజావార్తలు
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!