Amit Shah: కాంగ్రెస్, జేడీయూ టిప్పు సుల్తాన్‌ను నమ్ముకుంటున్నాయి.. బీజేపీ మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం కర్ణాటకలో పర్యటించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ మరియు కోకో మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్యాంప్కో) స్వర్ణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీయూపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ను కాంగ్రెస్, జేడీ(ఎస్)లు విశ్వసించాయని, ఈ రెండు పార్టీల వల్ల కర్ణాటకకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రం 16వ శతాబ్దపు తుళువ రాణి ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటా స్పూర్తితో సుసంపన్నమైన పాలన అందిస్తోందని ఆయన అన్నారు.
Read Also: Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?
Also Read
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని.. ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఏటీఎంగా ఉపయోగించుకుందని ఆరోపించారు. టిప్పును నమ్మే జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఓటేయాలా లేక రాణి అబ్బక్కపై విశ్వాసం ఉంచిన బిజెపికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి..? ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని దేశభక్తులా..? లేక కర్ణాటకను ఏటీఎంగా మార్చుకున్న గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ కా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీయూ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని.. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కర్ణాటక అభివృద్ధి చెందిందని అమిత్ షా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను గుర్తుంచుకుంటారని.. ఆయన నాయకత్వంలోనే బెంగళూర్ అభివృద్ధి చెందిందని అన్నారు.
- Tags
- Amith Shah
- bjp
- congress
- JDS
- karnataka
తాజావార్తలు
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!