Anant ambani wedding: టీ 20 వరల్డ్ కప్ విజేతలకు అంబానీ ఫ్యామిలీ ఘన సన్మానం
- టీ 20 వరల్డ్ కప్ విజేతలకు అంబానీ ఫ్యామిలీ ఘన సన్మానం
- రోహిత్.. సూర్యకుమార్... పాండ్యాకు స్పెషల్ సత్కారం
- శుక్రవారం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై వేదికగా ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూలై 12న పెళ్లితో అనంత్-రాధిక ఒక్కటి కాబోతున్నారు. అయితే మామేరు వేడుకలతో ముందుగానే అంబానీ నివాసంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రోజుకో కార్యక్రమంతో సందడి సందడిగా సాగుతోంది. శుక్రవారం సంగీత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహరథులతో సహా ఇటీవల టీ 20 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ప్రత్యేకంగా హాజరయ్యారు. నీతా అంబానీ వేదికపైకి ఎక్కి ఈ ముగ్గురిని స్టేజ్‌పైకి పిలిచి ఆత్మీయ ఆలింగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ నీతా కంటతడి పెట్టుకున్నారు. కప్ గెలిచికొచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుని ఆనందభాష్పాలు కురిపించారు. ఇక స్టేజ్‌పైకి పిలిచి ఘనంగా సన్మానం చేశారు. సభ మొత్తం చప్పట్లు కొట్టి అభినందించారు.

Also Read
టీ 20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. గురువారం ఢిల్లీ, ముంబైలో ఘన స్వాగతం లభించింది. ఇక శుక్రవారం అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత వేడుకలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను అంబానీ కుటుంబం ఘనంగా సత్కరించింది.
రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ముగ్గురూ ఆయా దుస్తులతో ప్రత్యేకంగా కనిపించారు. ముగ్గుర్ని ముంబై ఇండియన్స్ యజమానులు నీతా, ఆకాష్ అంబానీ సత్కరించారు. అతిథులందరూ లేచి నిలబడి ప్రత్యేకంగా ఆటగాళ్లను అభినందించారు. ఇక ‘లెహ్రా దో’ పాటకి అందరు చేతులు ఊపుతూ హాలు మొత్తం దేశభక్తి భావం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలు మీరు కూడా చేసేయండి.
#WATCH | During the Sangeet celebrations of Anant Ambani and Radhika Merchant, Chairperson of Reliance Foundation Nita Ambani called Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Hardik Pandya on stage and the whole gathering applauded the World Cup winning… pic.twitter.com/s6ITvK2t46
— ANI (@ANI) July 6, 2024
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!