Delhi: జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు శివ భక్తులతోపాటు సాధారణ భక్తులు రానున్నారు. మంచు కారణంగా యాత్రను నిలిపివేయగా.. తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. గత ఏడాది నిర్వహించిన అమర్‌నాథ్ యాత్రలో 3.45 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Hanuman Stotra: శని పరిహారాల కోసం ఈ స్తోత్ర పారాయణం తప్పక చేయండి
Also Read
- Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్, పహల్‌గామ్ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు నిర్ణయించింది.
Read also: Chandigarh : దారుణంగా దంపతుల హత్య.. ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీ..
పవిత్ర మంచు లింగానికి నమస్కరించడానికి, భక్తులు జూన్-ఆగస్టు నెలలలో కాశ్మీర్ హిమాలయాలలో ఉన్న పవిత్ర గుహ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రను నిర్వహిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం 2000లో జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటైన శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డుచే నిర్వహించబడుతుంది. రాష్ర్ట లెఫ్టినెంట్ గవర్నర్ పుణ్యక్షేత్రం బోర్డు ఛైర్మన్‌గా వ్యవహారిస్తారు.
తాజావార్తలు
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..