Live-In RelationShip: సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-In RelationShip: దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా సహజీవనం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవస్థలోకి రాకుండా.. సమస్యల సుడిగుండంలో ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ సహజీవనం వైపు వెళుతున్నారు. సహజీవనం నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తరువాత గొడవల కారణంగా హత్యలు జరుగుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
Read also: ICC World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు.. ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ మ్యాచ్
Also Read
కొద్దిరోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!