Film Workers Strike: తెలంగాణలో సినీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శులు సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నాయకులు మరోసారి భేటీ అవనున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం మూడు గంటలపాటు సాగిన ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చలు స్పష్టమైన ఫలితం లేకుండా ముగిశాయి. నిర్మాతలు పెట్టిన రెండు…
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.…
తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కోసం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, మరియు నిర్మాతల మధ్య ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశం పరిశ్రమలో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ సమస్యలపై దృష్టి సారించింది. ఈ చర్చల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత…
ఈనెల 25న భారత్ బంద్‌కు ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా పలు డిమాండ్లతో భారత్ బంద్‌కు ఫెడరేషన్ పిలుపు ఇచ్చినట్లు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ వెల్లడించారు. కేంద్రం కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టకపోవడం, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం వంటి…