Akhilesh: అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్.. యూపీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో డీల్
- ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ బిగ్ ప్లాన్
- ఐ-ప్యాక్‌తో డీల్ కుదుర్చుకున్న అఖిలేష్ యాదవ్
- వచ్చే ఏడాదే యూపీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2027 ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటికే ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు యోగి ప్రభుత్వం నడుస్తోంది. ఈ సారైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్, మాయావతి ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బారీ స్కెచ్ వేశారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఐ-ప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
పార్టీ ప్రచారాన్ని జిల్లా, బూత్ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఐ-ప్యాక్‌ను నియమించుకున్నట్లుగా అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐ-ప్యాక్‌ను నియమించుకోవాలని స్టాలిన్, మమతా బెనర్జీ సలహా ఇచ్చారని చెప్పారు. ఇక ఐ-ప్యాక్ సూచన మేరకు మార్చి 28న ఎన్నికల సమర శంఖారావం పూరించాలని నిర్ణయం తీసుకున్నారు. నోయిడా ర్యాలీతో అఖిలేష్ యాదవ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో దారుణం.. వరుడి ముందే వధువును గన్‌తో కాల్చిన ప్రియుడు
ఐ-ప్యాక్… ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరోన్మోయ్ నందా వెల్లడించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) ను ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. ప్రస్తుతం దీనికి ప్రతీక్ జైన్ నాయకత్వం వహిస్తున్నారు. కీలక వ్యూహకర్తగా.. నాయకుడిగా పనిచేస్తున్నారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!