Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!
- అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పైలట్లే ఫోకస్
- వివీఐపీ ఫ్లైట్‌కు సేవలందించిన కెప్టెన్ సుమిత్
- ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ ప్రతిభకు ప్రశంసలు
- వైరల్ అవుతున్న అజిత్ పవార్ గ్రూప్ ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్‌వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA) విదిప్ జాదవ్, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, , విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ధృవీకరించింది.
ఈ విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ సుమిత్ కపూర్ ప్రధాన పైలట్‌గా నడిపించగా, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ సహా పైలట్‌గా వ్యవహరించారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఏవియేషన్ అభ్యసించిన శాంభవి, న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొంది 2022 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీరితో పాటు పింకీ మాలి విమాన సహాయకురాలిగా విధులు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ లియర్‌జెట్ 45 విమానం (VT-SSK) ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో కూడా 2023 సెప్టెంబర్ 14న ముంబైలో ఒక విమాన ప్రమాదాన్ని ఎదుర్కోవడం గమనార్హం.
Also Read
- CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
- PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
- Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది, రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..
తాజావార్తలు
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్‌గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!