Sharad Pawar: అజిత్ పవార్ సీఎం కావడం ఎప్పటికీ కలగానే మిగులుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.
ఇదిలా ఉంటే గురువారం అజిత్ పవార్ గురించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ ఎప్పటికీ మహరాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. అది కలగానే మిగులుతుందని చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన..దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన లేదని, మహారాష్ట్రలో కూడా అధికారం కోల్పోతుందని జోస్యం చెప్పారు.
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
Read Also: Israel: సిరియాపై ఇజ్రాయిల్ దాడి..2 ఎయిర్‌పోర్టులు ధ్వంసం.
ఈ ఏడాది జూలై నెలలో ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడింది. శివసేన(ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గంలోకి మరికొంత మంది మంత్రి పదవులను స్వీకరించారు.
శరద్ పవార్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఒకసారి సుప్రియా సూలేను ఎన్సీపీ అధ్యక్షురాలిగా చేయాలని ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారని, అయితే ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ వర్గంలో ఉన్నారని శరద్ పవార్ అన్నారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!