Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- సోమవారం చైనాకు వెళ్లనున్న NSA అజిత్ దోవల్.
- చైనా ప్రత్యేక ప్రతినిధి వాంగ్ యీతో 25వ విడత చర్చలు.
- భారత్-చైనా సరిహద్దు వివాదమే ప్రధాన అజెండా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దోవల్, వాంగ్ యీలు మంగళవారం చర్చలు జరపనున్నారు. దాదాపు 2,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యతో పాటు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ నెలలో బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి ముందు భారత్, చైనాల మధ్య ఈ హైలెవల్ మీటింగ్ జరుగుతోంది. బ్రిక్స్ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడకున్నా, షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిసారిగా మోడీ, జిన్‌పింగ్‌లు గతేడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా చివరిసారిగా సమావేశమయ్యారు.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఈ నేపథ్యంలోనే దోవల్ చైనా పర్యటనకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటికి ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం అత్యంత అవసరమని చెప్పారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్గిరి ప్రాంతంలోకి చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారనే నివేదిక నేపథ్యంలో జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
తాజావార్తలు
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!