ఢిల్లీ విమానాశ్రయంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన పైలట్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కెప్టెన్ వీరేంద్ర సెజ్వాల్ తనపై దాడి చేశాడంటూ అంకిత్ ధావన్ అనే ప్రయాణికుడు మైక్రోబ్లాగింగ్‌లో ఆరోపించాడు. ఈ వార్త వైరల్‌గా మారడంతో ఎయిర్‌లైన్స్ సంస్థ చర్యలకు దిగింది. ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది.