Air India: ఎయిర్ ఇండియా విమానంలోకి ఓ పైలెట్ తన స్నేహితురాలిని కాక్‌పిట్ లోకి తీసుకెళ్లిన ఘటనలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు పైలెట్ పై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల ఫైన్ విధించింది.
Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరసగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన ఆ సంస్థ పరువు తీసింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విమానయాన సంస్థలకు జరిమానా విధించింది. ఇదిలా ఉంటే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఓ పైలెట్ తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. దీనిపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది.