AI Technology in Tamil Nadu Election Campaign: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ.. ఐడియా భలే ఉందే..
- తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ..
- టీవీకే అధినేత విజయ్ పార్టీ అభ్యర్థుల ఏఐ ప్లాన్..
- ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ టెక్నాలజీ వినియోగం..
- విజయ్ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్లే కనిపిస్తూ ఓటర్లతో మాట్లాడుతున్న వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Technology in Tamil Nadu Election Campaign: టెక్నాలజీలో ఎప్పటికప్పుడూ కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి.. ఎన్నికల ప్రచారానికి కాదేది అనర్హం అనే రీతిలో నేతలు టెక్నాలజీని వాడేస్తూ ఔరా..! అనిపిస్తున్నారు.. తమిళనాడు ఎన్నికల రాజకీయం ఇప్పుడు టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రచారంలో ఏఐ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కోసం అభ్యర్థులు వాడుతున్న సాంకేతికత చర్చనీయాంశంగా మారింది. విజయ్ తన సినిమాలతో ఎంత పాపులరో, రాజకీయాల్లోనూ అంతే దూకుడుగా ఉన్నారు. అయితే, సమయాభావం వల్ల ఆయన అన్ని నియోజకవర్గాలకు స్వయంగా వెళ్లడం సాధ్యం కావడం లేదు. దీన్ని అధిగమించేందుకు టీవీకే అభ్యర్థులు ‘హోలోగ్రాఫిక్ ఏఐ కమ్యూనికేషన్’ అనే అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు.
Read Also: Rajnikanth : ‘తలైవర్ 173 నుండి డైరెక్టర్ ఔట్.. రేసులోకి క్రేజీ డైరెక్టర్
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
ఈ టెక్నాలజీ ద్వారా విజయ్ నేరుగా అక్కడికి వచ్చి ఓటర్లతో మాట్లాడుతున్నట్లే కనిపిస్తుంది. తాజాగా కుంభకోణంలో ఈ పద్ధతిలో నిర్వహించిన ప్రచారం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టేజ్ మీద విజయ్ ప్రత్యక్షంగా ఉన్నట్లు ఉండటంతో జనం భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో ప్రచార శైలి ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.. కానీ, అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.. కాగా, మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 4వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు..
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?