Actor Satish Shah’s Response To Racist Comment At UK’s Heathrow Airport: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా.. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్నా.. ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నా బ్రిటన్ కు బుద్ధి రావడం లేదు. అక్కడ కొంతమంది ప్రజలు ఇంకా జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించిందనే సోయి కూడా లేదు. చివరకు తమన ఆర్థిక పరిస్థిని చక్కదిద్దే బాధ్యతను భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ కు అప్పగించారు.
ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ సతీష్ షాపై బ్రిటన్ అధికారి జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్ హీత్రూ విమానాశ్రయంలో తనపై ఓ సిబ్బంది జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని ప్రముఖ నటుడు సతీష్ షా వెల్లడించారు. ఎయిర్ పోర్టు సిబ్బంది ఒకరు ‘‘వీరు ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలా కొన్నారు?’’ అని మరో సిబ్బందితో అనడాన్ని గమనించిన సతీష్ షా వారికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘‘ ఎందుకంటే మేం భారతీయులం’’ అంటూ మాస్ ఆన్సర్ చెప్పారు. గర్వంతో చిరునవ్వుతో వారికి బదులిచ్చానని సతీష్ షా ట్వీట్ చేశారు.
Read Also: Bengaluru: బెంగళూర్‌లో భయానక ఘటన..రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో కుళ్లిన మహిళ మృతదేహం
ప్రస్తుతం సతీష్ షాపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఏకంగా 12,000 లైకులు, 1300 రీట్వీట్ లు వచ్చాయి. సతీష్ షాకు మొత్తం 45,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే హీత్రూ విమానాశ్రయం ట్విట్టర్ ద్వారా సతీష్ షాకు క్షమాపణలు చెప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని కోరింది. దీనిపై భారతీయులు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. బ్రిటీష్ వారు 200 ఏళ్లు మనల్ని పాలించకపోతే.. బహుశా ఇంగ్లాండ్ ఈ రోజు మన కాలనీగా ఉండేది అని ఒక వినియోగదారుడు రీట్వీట్ చేశారు.
సతీష్ షా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ తో ఫేమస్ అయ్యారు. ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘ హమ్ సాథ్ సాథ్ హై’, ‘కహోనా ప్యార్ హై’. ‘మై హూనా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
I replied with a proud smile “because we are Indians” after I overheard the Heathrow staff wonderingly asking his mate”how can they afford 1st class?”
— satish shah🇮🇳 (@sats45) January 2, 2023