Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.