Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, కార్యకర్తలు కనిపిస్తే సాధారణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలా చోట్ల టీఎంసీ నేతల్ని ప్రజలు కొడుతున్నారు. మమతా బెనర్జీ హయాంలో తమపై జరిగిన అకృత్యాలకు ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. టీఎంసీ కార్యకర్తలు, నేతలు కట్ మనీ రూపంలో తమను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల టీఎంసీ గుండాలు ప్రజల స్థలాలను ఆక్రమించుకుని పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి బీజేపీ వచ్చిన వెంటనే ప్రజలు తిరగబడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సెగ ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీని ప్రజలు చావగొట్టారు. సోనార్‌పూర్‌లో అభిషేక్‌పై శనివారం దాడి జరిగింది. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనపై దాడి చేశారు. చివరకు పోలీసులు, భద్రతా సిబ్బంది ఆయనకు హెల్మెట్ తొడిగి అక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చొక్కా చింపి, కాళ్లతో తన్నుతూ, కోడిగుడ్లు విసిరేస్తూ స్థానికులు దాడికి పాల్పడ్డారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
దాడి చేసిన స్థానికులు మాట్లాడుతూ.. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, మాకు రోడ్లు ఎప్పుడూ వేయలేదని, వచ్చిన డబ్బంతా దోచుకున్నాడని ఆరోపించారు. ఇప్పటికీ తాము బాధపడుతున్నామని, అందుకే కోపంగా ఉన్నామని చెప్పారు. తాము ఇక్కడే నివసిస్తున్నామని చెప్పారు. మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు రోడ్లు బాగుచేయాలని, నీటి సరఫరా మెరుగుపరచాలని కోరతూ అనేక విన్నపాలు చేసినప్పటికీ, కనీసం పట్టించుకోలేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించామని చెబుతున్నారు.
తనపై జరిగిన దాడికి బీజేపీ కారణమని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. తనకు జరిగిందంతా ప్రజలు చూశారని, ఇదంతా బీజేపీ కుట్ర అని ఆయన అన్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు లేరని చెప్పారు. ఈ ఘటనకు అధికార పార్టీ కారణమని టీఎంసీ ఆరోపిస్తుండగా, స్థానికులు మాత్రం తామే దాడికి పాల్పడ్డామని, తమకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..