Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అభిషేక్ బెనర్జీ బహిరంగ సవాల్.
- "టీఎంసీలోకి తిరిగి వస్తే గంటలోనే రాజీనామా చేస్తా" అని ప్రకటన.
- తనపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో భారీ సంక్షోభం ఏర్పడింది. రీటబ్రత బెనర్జీ నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. ఇక 20 మంది ఎంపీలు టీఎంసీకి గుడ్‌బై చెప్పారు. తిరుగుబాటు నేతలు మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓటమికి ఆయనే కారణమని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, అభిషేక్ బెనర్జీ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరిగి మమతా బెనర్జీ వైపు తిరిగి వస్తే, తనతో ఏదైనా సమస్య ఉంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, తనను తిడితే ఈడీ, సీబీఐల నుంచి వారికి రక్షణ లభిస్తుందనే హామీ లభించిందని అన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
‘‘నాపై మీకు అభ్యంతరాలు ఉంటే, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలోకి తిరిగి రండి. మీరు తిరిగి వచ్చిన గంటలోనే నేను నా పదవికి రాజీనామా చేస్తాను’’ అని అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. పార్టీ ఓటమికి నేను బాధ్యుడిన అని చెబితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ సాధించిన విజయానికి కూడా నాకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఓటమికి బాధ్యత నాదైతే, విజయానికి కీర్తి కూడా నాదే కావాలి అని అభిషేక్ బెనర్జీ అన్నారు. జూలై 19,20,21 ఏ రోజైనా తిరిగి టీఎంసీలో చేరాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!