Nani: జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న నేచురల్ స్టార్ నాని మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన భారతీయ సినిమాలకి ఇతర దేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కాగా ఇలాంటి కీర్తిని సంపాదించడంలో కీలక పాత్ర వహించింది మాత్రం గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తాను తెరకెక్కించిన ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాలు సంచలన విజయాలు సాధించి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర భారీ పాపులారిటీ తెచ్చుకున్నాయి. అయితే ఒకపుడు సినిమా పెద్ద హిట్ అయింది అంటే అది థియేటర్స్ లో ఎన్ని రోజులు రన్ అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి.కేవలం వసూళ్లు ఆధారంగా సినిమాల ఫలితాలు లెక్కిస్తున్నారు.
Also Read: Krithi Shetty: ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన కృతి శెట్టి..
Also Read
ఇలాంటి డిజిటల్ వరల్డ్ లో కూడా ఓ సినిమా 50 లేదా 100 రోజులు రన్ అవ్వడం అనేది గగనం. చెప్పాలంటే మన దేశంలో.. మన సినిమా.. మన దగ్గర 50 రోజులు ఆడని రోజులు ఇవి. అలాంటిది ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జపాన్ దేశంలో ఒక సంవత్సరం 9 నెలలు ఓ స్క్రీన్ లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యిందట. ఇక ఈ సక్సెస్‌ని దృషటిలో పెట్టుకుని ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ ని కూడా జపాన్ లో విడుదల చేశారు. కానీ ఆదరణ దక్కలేదు. టీమ్ అంత వెళ్లి ప్రమోషన్లు చేసినా ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ దొరకలేదు.
అలాంటి ఇప్పుడు నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ జపాన్‌లో రిలీజ్ కి సిద్దం అయింది. ‘సూర్యాస్ సాటర్డే’ పేరుతో ఫిబ్రవరి 14 అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లలో విడుదలకానుంది. నిజానికిది ఇది కొంత రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే అక్కడ విడుదలైన అన్ని ఇండియన్ మూవీస్ ఒకే స్థాయిలో విజయం సాధించలేదు. అందులోనూ ఆ మూవీ పెద్దగా హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!