Aadhaar For Newborns Along With Birth Certificates In All States: నవజాత శిశువులకు బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకురానుంది. ఈ మేరకు పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇక మీదట బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ఈ సదుపాయం దేశంలో 16 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఇకపై అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు కేంద్ర సిద్ధం అయింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేస్తోంది. ఈ ప్రక్రియను గతేడాది ప్రారంభించింది.
Read Also: Agniveer salary package: అగ్నివీరుల సాలరీ ప్యాకేజీ .. 11 బ్యాంకులతో ఇండియన్ ఆర్మీ ఎంఓయూ
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఉడాయ్) రాబోయే కొద్ది అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ముందుగా పిల్లల బయోమెట్రిక్, ఐరిస్ నమోదు చేయకుండా.. వారి ఫోటోలను తల్లిదండ్రుల ఆధార్ తో అనుసంధానించనున్నారు. పిల్లవాడికి 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో బయోమెట్రిక్ ద్వారా చేతి వేలిముద్రలు, ఐరిస్ అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
ప్రస్తుతం దేశంలో 1000 కన్నా ఎక్కువ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారు. వీటిలో దాదాపుగా 650 పథకాలు రాష్ట్రప్రభుత్వాలవి అయితే.. 315 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 134 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.