Oleander Flowers: “ఒలియాండర్ పూలు” కేరళ ఆలయాల్లో నిషేధం.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oleander Flowers: కేరళలోని రెండు ప్రధాన దేవస్వామ్ బోర్డులైన ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ), మలబార్ దేవస్వోమ్ బోర్డ్‌ల పరిధిలోని అన్ని దేవాలయాలు ‘‘ఒలియాండర్ పూలను’’ నిషేధించాయి. అరళీ పూలు, ఎర్రగన్నేరు పూలుగా పిలిచే వాటిని ఆలయాల్లో పవిత్ర ఆచారాల్లో వినియోగించడాన్ని నిలిపేశాయి. మానవులు, జంతువులకు హాని కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. గురువారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఈ పూలను నిషేధించినట్లుగా ట్రావెన్ కోర్ దేవస్వోమ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.
టీబీడీ ఆధ్వర్యంలోని దేవాలయ నైవేద్యాల్లో, ప్రసాదాల్లో అరళీ పువ్వులను ఉపయోగించడాన్ని పూర్తిగా నివారించాలని నిర్ణయించామని, అందుకు బదులుగా తులసి, తేచి(ఇక్సోరా), మల్లె, చామంతి, గులాబీ వంటి ఇతర పువ్వులను ఉపయోగిస్తామని ప్రశాంత్ విలేకరులకు తెలిపారు. ట్రావెన్ కోర్ పరిధిలోని 1248 దేవాలయాలు, మలబార్ దేవస్వం పరిధిలోని 1400 ఆలయాల్లో ఈ అరళీ పువ్వులను వినియోగించడాన్ని నిషేధించారు.
Also Read
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
Read Also: Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..
నిషేధానికి కారణం ఏంటి..?
కేరళలోని అలప్పుజాలో ఒలియాండర్(అరళీ పువ్వు)పూలు తినడం వల్ల ఒక యువతి మరణించింది. దీంతో ఆలయ నైవేద్యాల్లో వీటిని నిషేధించారు. అయితే, పూజ కోసం ఈ పూలను ఉపయోగించడంపై పరిమితులు లేవు. అరళీ ఆకులను, పూలను అనుకోకుండా నమలడం వల్ల 24 ఏళ్ల సూర్యా సురేంద్రన్ అనే యువతి మరణించింది. నర్సింగ్ ఉద్యోగంలో చేరేందుకు యూకే వెళ్లేందుకు నెడుంబస్సేరి విమానాశ్రయానికి చేరిన సమయంలో అక్కడే కుప్పకూలింది. ఆమెను వెంటనే కొచ్చిలోని అంగమలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరనించింది. ఈ ఒలియాండర్ పూలలో గుండెకు హాని కలిగించే కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?