Kollywood : ఐశ్వర్య – ధనుష్ లకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
- ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు మంజూరు
- అధికారకంగా ప్రకటించిన చెన్నై కోర్టు
- 18 ఏళ్ల వైవాహిక బంధానికి నేటితో ముగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నాం అని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇటీవల ఈ జంట మరల ఒకటవ్వబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేసాయి. అవేవి వస్తావం కాదని విడాకులు కావాలని కోర్టు ను ఆశ్రయించారు. ఐశ్వర్య, ధనుష్ నవంబర్ 21 న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు, అక్కడ వారు విడిపోవాలనే కోరుకుంటున్నట్టు న్యాయస్థానం ముందు వ్యక్తం చేశారు. విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణను నవంబర్ 27కి వాయిదా వేశారు. నేడు వీరి కేసులో తుది తీర్పు వెల్లడిస్తూ వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. ధనుష్, ఐశ్వర్య 2004లో చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
Also Read : Kollywood : తమిళ ఇండస్ట్రీని ఆదుకున్న చిన్న హీరోలు
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో విడిపోవాలనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖలో “స్నేహితులుగా, జంటగా, పేరెంట్స్ గా, శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి ఉన్నాం. ఇన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, సర్దుకుంటూ ప్రయాణం సాగించాం. కానీ ఈరోజు మా దారులు వేరవుతున్నాయి మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని ధనుష్ ట్వీట్ చేశాడు. అదే మెసేజ్ ను అటు ఐశ్వర్య కూడా షేర్ చేసింది. ఈ దంపతులకు లింగా, యాత్ర అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఉంటుంది. ధనుష్ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నివాసం ఉంటున్న పోయెస్ గార్డెన్ కు సమీపంలో ధనుష్ నూతనంగా ఓ ఇళ్లు కొనుగోలు చేసాడు.
తాజావార్తలు
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?