Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Man Made His Wife Take A Bath Naked Her To Get Profits In Business

Naked Bath for Wife: వ్యాపారంలో లాభాలు వస్తాయన్నాడు.. అందరిముందు భార్యను అలా..!

Published Date :August 23, 2022 , 10:28 am
By NTV WebDesk
Naked Bath for Wife: వ్యాపారంలో లాభాలు వస్తాయన్నాడు.. అందరిముందు భార్యను అలా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనే అత్యాశతో మూఢ నమ్మకాలు కొందరిని ఈజాఢ్యం వైపు నడిపిస్తూనే వుంది. అభివృద్ది జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఈతరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని నమ్మవద్దని, వాటి ద్వారా దాడులకు పాల్పడవద్దని పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. ఓ భర్త డబ్బుపై అత్యాశతో మంచిగా సంపాదించుకునే అవకాశం వస్తుందని తన భార్యను ఏకంగా అందిరి ముందు నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించాడు.

ఈఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తి వ్యాపారాలు చేస్తున్నాడు. అతనికి భార్య, కుటుంబం ఉంది. సాదాసీదాగా జరుగుతున్న వారి కుటుంబంలో.. కొన్ని రోజులుగా అతనికి వ్యాపారంలో ఆశించిన మేరకు పురోగతి లేదు. నిరాశతో వున్న అతను ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కొందరు క్షుద్రపూజ చేయించాలని ఉచిత సలహా ఇచ్చారు. క్షుద్రపూజలు చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించారు. అంతేకాదు.. ఇంట సుఖసంతోషాలు.. ఆయురారోగ్యాలు వస్తాయని మాయమాటలు చెప్పడంతో.. వారి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ వ్యక్తి క్షుద్రపూజ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఈనేపథ్యంలో.. భార్యను అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని కోరాడు. భర్తమాటలకు ఒక్కసారిగా ఖంగుతింది భార్య. ఆపని చేయడానికి అస్సలు ఓప్పుకోలేదు. అయితే, ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశాడు, దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించడం గమనార్హం. ఏంచేయలేని పరిస్థితి, విధి లేక.. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె వారు చెప్పినట్లే చేసింది. అక్కడ అందరూ చుట్టూ ఉన్నవారు కూడా ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారే తప్ప, ఎవరూ ఆదారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బతికున్నా చచ్చినదాంతో సమానంగా భావించింది ఆతల్లి.. ఆపనితో ఆమెలో సహనం చచ్చిపోయింది.

తెగించి బాధితురాలు వారినుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను ,అతని తల్లిదండ్రులనూ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సలహా ఇచ్చిన మాంత్రికుడు పరారీలో ఉన్నాడని.. అతనిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. డబ్బుకోసం తన భార్యనే అందరి ముందు నగ్నంగా నిలచెట్టి స్నానం చేయించిన నీచుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
BJP MLA Raja Singh: ధర్మం కోసం చావడానికైనా సిద్ధం.. మళ్లీ వీడియో పెడతా.. రాజాసింగ్‌ సవాల్‌..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • naked wife bath
  • Pune crime
  • Pune crime news
  • wife bath in Pune
  • wife bath naked

తాజావార్తలు

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

  • OTR: ఐవీఆర్ఎస్‌ సర్వే రిపోర్ట్స్‌.. బెంబేలెత్తిపోతున్న ఆ ఎమ్మెల్యేలు..!

  • Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..

  • OTR: ప్రభుత్వం టార్గెట్‌గా పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న ప్రతిపక్షం..!

  • OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions