A Man Fires At Family In Madhya Pradesh For Stopping Him Urinating: సాధారణంగా మనం ఇంటి చుట్టూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటాం. ఒకవేళ చెత్తచెదారంతో నిండి ఉంటే మాత్రం ఒళ్లంతా కంపరంగా అనిపిస్తుంది. అలాంటిది.. ఎవరైనా ఇంటి ముందు మూత్రం పోస్తే చూస్తూ ఊరుకుంటామా? కచ్ఛితంగా పోయొద్దని మనదైన శైలిలో బుద్ధొచ్చేలా చెప్తాం. అలా చెప్పిన పాపానికి ఓ వ్యక్తి రివర్స్‌లో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్పులు కూడా జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఒక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Drug Supplier Mohit: డ్రగ్స్ కేసు.. నేడు మోహిత్ విచారణ
ఆ వివరాల్లోకి వెళ్తే.. భింద్ జిల్లాలోని నయగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోట్ గ్రామంలో వికాస్ కుటుంబం నివాసముంటోంది. వీరి ఇంటి ముందు పింటూ శర్మ నిత్యం మూత్ర విసర్జన చేస్తుంటేవాడు. ఎన్నిసార్లు చెప్పినా.. పింటూ శర్మ తన ధోరణి మార్చుకోలేదు. మంగళవారం కూడా అతడు అదే పని చేయడంతో.. వికాస్ కోపంతో రగిలిపోయాడు. ఇంకోసారి తన ఇంటి ముందు మూత్రం పోయొద్దని చెప్పాడు. దీంతో.. వికాస్, పింటూ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోపూ పింటూ శర్మపై వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనికి తగిన బుద్ధి చెప్పాలని కోరాడు. దీంతో.. పింటూకి పోలీసులు తమదైన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఆ పాడు పని చేయొద్దని బుద్ధి చెప్పారు.
Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో..
తనపై ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయాన్ని పింటూ శర్మ భరించలేకపోయాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పూటుగా మద్యం సేవించి, తన అననుచరితో వికాస్ ఇంటికి తుపాకీతో వెళ్లాడు. అక్కడికెళ్లగానే వికాస్ ఇంటి సభ్యులపై తుపాకీతో తెగబడ్డాడు. ఈ ఘటనలో వికాస్ ఇంట్లో ఇద్దరు సభ్యులు గాయపడగా.. 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పింటూతో పాటు అతని అనుచరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వికాస్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Amit Shah: అస్సాంలో కేంద్ర మంత్రి అమిత్ షా విమానం అత్యవసర ల్యాండింగ్