A Jammu Kashmir Woman Loots 27 Men After Marrying Them: ఈజీ మనీకి అలవాటుపడిన ఓ మహిళ నిత్య పెళ్లికూతురిగా అవతారం ఎత్తింది. బాగా డబ్బున్న వాళ్లకు గాలం వేసి.. వారిని పెళ్లి చేసుకుని.. కొన్ని రోజులకే ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని ఉడాయించడమే పనిగా పెట్టుకుంది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 27 మందిని మోసం చేసింది ఆ కిలేడీ. ఒక మధ్యవర్తిత్వం సహాయంతో పెళ్లి చేసుకొని, కొన్ని రోజులు కాపురం చేశాక ఉడాయించేది. 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కిలేడీ బాగోతం బట్టబయలు అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Boyfriend Cheating: నమ్మి బాయ్ ప్రెండ్ తో వెళ్తే.. స్నేహితులతో కలిసి అత్యాచారం
జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో 12 మంది యువకులు తమ భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లందరూ ఇచ్చిన ఫోటోల్లో ఒకే మహిళ ఉండటంతో.. పోలీసులు ఖంగుతిన్నారు. కేవలం ఫోటోనే కాదండోయ్.. తమ ఫిర్యాదులో ఆ 12 మంది చెప్పిన స్టోరీ కూడా దాదాపు ఒకేలా ఉంది. ఒక మధ్యవర్తిత్వం సహాయంతో ఆ యువతితో పెళ్లి జరిగిందని.. కాపురం చేసిన కొన్ని రోజుల్లోనే ఇంట్లో ఉన్న నగలు, నగదుతో ఉడాయించిందని వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఇంకాస్త లోతుగా వెళ్లి దర్యాప్తు చేయగా.. మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆమె మొత్తం 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. 12 మంది మాత్రమే ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, ఫోటో ఆధారంగా ఆ కిలేడీని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న
ఒక బాధితుడు తన గోడు వెళ్లబోసుకుంటూ.. ‘‘నాకు పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరిక ఉండేది. కానీ, కొన్ని కారణాల వల్ల నా పెళ్లి చాలా సంవత్సరాలపాటు వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి నన్ను సంప్రదించాడు. ఓ యువతితో పెళ్లి చేస్తానని చెప్పాడు. కాకపోతే మెహర్ (పెళ్లి కాంట్రాక్ట్‌లో భాగంగా పెళ్లికూతురికి ఇచ్చే గిఫ్ట్) కింద రూ.2 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. నేను సరేనని ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన రెండు వారాల తర్వాత ఇంటికి వెళ్లొస్తానని నా భార్య వెళ్లింది. అంతే, అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.