Boy Killed His Brother In Kakinada Over Catching Fish: ఒకప్పుడు ప్రజలు కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఐక్యంగా ఉంటూ, ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కించుకునేవారు. కానీ.. రానురాను మనుషుల్లో మార్పు వచ్చేసింది. కుటుంబ విలువల్ని పక్కనపెట్టేసి, పోటీతత్వం పెంచుకున్నారు. క్రమంగా ఆ పోటీ గొడవలుగా మారాయి. ఇప్పుడు అయినవారినే కాటికి చేర్చడానికి వెనుకాడటం లేదు. ‘నువ్వెంత-నువ్వెంత’ అంటూ వివాదాలకు దిగి.. పగలు, ప్రతీకారాలు పెంచుకుని.. చంపుకుంటున్నారు. తాజాగా కాకినాడలో తన తమ్ముడ్నే ఓ అన్నయ్య చంపేశాడు. చేపలు పట్టుకునే విషయంలో గొడవ ఏర్పడటంతో.. ఆ అన్న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tirupati Crime: ప్రియుడి ఘాతుకం.. ప్రేమ వివాహానికి అంగీకరించలేదని..
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమురులో అబ్బులు, వంశీ అనే ఇద్దరు సోదరులున్నారు. వీళ్లిద్దరు కలిసి చెరువు దగ్గర చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే.. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో కోపాద్రిక్తుడైన వంశీ.. తన సోదరుడు అబ్బులుని చెరువులో తోసేశాడు. అతడు నీటిలో మునిగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయపడిన వంశీ.. తమ్ముడు చనిపోయిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టాడు. మరోవైపు.. అబ్బులు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు అతని కోసి గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా అతడు చెరువు దగ్గరికి వెళ్లడానికి సమాచారం తెలియడంతో.. అక్కడికి వెళ్లి వెతికారు. అప్పుడు పోలీసులకు అతని మృతదేహం చెరువులో కనిపించగా, బాడీని బయటకు తీశారు.
ATM AC Robbery: ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!
తన అన్నయ్య వంశీతోనే కలిసి అబ్బులు చెరువుకి వచ్చాడు కాబట్టి.. వంశీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో అతడు అసలు నిజం చెప్పేశాడు. చేపలు పట్టుకునే విషయంలో గొడవ నెలకొనడంతో.. తానే సోదరుడ్ని చంపేశానని ఒప్పుకున్నాడు. అన్నయ్యే తమ్ముడ్ని చంపాడన్న విషయం తెలిసి.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.