Punjab Road Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైసాఖీ వేడుకలకు వెళ్తున్న యాత్రికులకు విషాదాన్ని మిగిల్చింది. హోషియార్ పూర్ జిల్లాలోని ఖురల్ ఘర్ సాహిబ్ లో బైసాఖీ వేడుకలను జరుపుకోవడానికి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా.. మరో 10 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా నివాసితులేనని గర్హశంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్జీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు.
Read Also: Asaduddin Owaisi: బీజేపీ వారిని కూడా ఇలాగే చంపేస్తుందా.? యూపీ ఎన్‌కౌంటర్‌పై ఓవైసీ
ప్రమాద జరిగిన ప్రాంతం వాలుగా ఉందని, డ్రైవర్ నడిపేటప్పుడు నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళ్తున్న 17 మంది యాత్రికులను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను రాహుల్, సుదేష్ పాల్, సంతోష్, అంగూరి, కుంతి, గీత, రామోహ్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు రిఫర్ చేయగా, మిగిలిన వారిని గర్‌శంకర్‌లోని సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఖురల్ ఘర్ సాహిబ్ కు బైశాఖీ పండగ సందర్భంగా పెద్ద ఎత్తున యాత్రీకులు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.