Congo fever: గుజరాత్లో ‘కాంగో ఫీవర్’ కలకలం.. 5 ఏళ్లలో తొలి మరణం..
- గుజరాత్లో ‘‘కాంగో ఫీవర్’’ కలకలం..
- 5 ఏళ్లలో తొలిసారి రోగి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congo fever: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 51 ఏళ్ల వ్యక్తి క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం (CCHF)తో మరణించాడు. సాధారణంగా దీనిని ‘‘కాంగో జ్వరం’’గా పిలుస్తుంటారు. గత 5 ఏళ్లలో ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించి మొదటిసారిగా మరణం సంభవించినట్లు వైద్యులు మంగళవారం తెలిపారు. మోహన్ భాయ్‌గా గుర్తించబడిన బాధితుడు పశువుల పెంపకందారుడు. జనవరి 21న ఆస్పత్రిలో చేరాడు. జనవరి 27న చికిత్స సమయంలో మరణించారు. అతడి బ్లడ్ శాంపిళ్లనున పూణేలోని ల్యాబ్‌కి పంపగా, ఈ వైరస్ ఉనికి బయటపడింది.
Read Also: Ind vs Eng 3rd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సీనియర్ పేసర్ వచ్చేశాడు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
రోగి మరణంతో ఆయన నివాసం ప్రాంతంలో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. మరిన్ని కేసులు రాకుండా అధికారులు కుటుంబ సభ్యుల్ని పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ వైరస్ సోకిన రోగులకు జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకిన 2-4 రోజుల తర్వాత నిద్రలేమి, నిరాశ, కడుపు నొప్పి, నోరు, గొంతు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ తీవ్రమైన జ్వరానికి కారణమవుతుంది. దీని మరణాల రేటు 40 శాతం వరకు ఉంది. ప్రస్తుతం దీనికి టీకాలు లేవు. ఈ వైరస్ ప్రధానంగా పేలు, పెంపుడు జంతువుల నుంచి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, ఇతర శరీర స్రావాలు ద్వారా అతడికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా సోకే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!