Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 26 11 Hero Sadanand Date Appointed New Maharashtra Dgp

Sadanand Date: మహారాష్ట్ర డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే..

Published Date :December 31, 2025 , 9:26 pm
By Venu Goapl Reddy
  • మహారాష్ట్ర కొత్త డీజీపీగా సదానంద్ దాతే..
  • 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులపై వీరోచిత పోరాటం..
Sadanand Date: మహారాష్ట్ర డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sadanand Date: మహారాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వాసంత్ దాతే నియమితులయ్యారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన పోలీస్ అధికారిగా దాతేకు పేరుంది. 1990 బ్యాచ్‌కు చెందిన 59 ఏళ్ల దాతే, జనవరి 3న పదవీ విమరణ చేయనున్న రష్మీ శుక్లా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్రలో 2 లక్షలకు పైగా ఉన్న పోలీస్ దళానికి అధిపతి కానున్నారు. ఆయన రెండేళ్ల పాటు డీజీపీగా సేవలందించనున్నారు. ఇటీవల కేంద్ర డిప్యూటేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, దాతేను అత్యున్నత పదవి వరించింది. అంతకుముందు ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చీఫ్‌గా పనిచేశారు.

Read Also: Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్ కూడా కష్టమేనా?

Also Read

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Bengal Elections: ఎన్నికల కౌంటింగ్‌ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో, అప్పటి అడిషనల్ కమిషనర్‌గా ఉన్న దాతే కామా ఆస్పత్రి వద్ద ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను ఎదుర్కొన్నారు. గ్రెనేడ్ ముక్కలు తగిలి తీవ్రంగా గాయపడినప్పటికీ, విరోచితంగా పోరాడారు. ఈ వీరత్వానికి గానూ ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించింది. ఇప్పటికీ ఆయన శరీరంలో, ముఖ్యంగా కంటి సమీపంలో గ్రెనేడ్ పేలుడులోని లోహపు ముక్కలు ఉన్నాయి. వీటిని గాయాలుగా కాకుండా యుద్ధంలో లభించిన పతకాలుగా భావిస్తానని గతంలో ఆయన అన్నారు.

మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లో, మీరా-భయందర్, వసాయి-విరార్‌కు మొదటి పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. దాతే ముంబై పోలీసులో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతిభద్రతలు)- క్రైమ్ విభాగంలో కూడా పనిచేశారు.ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో డీఐజీగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో ఐజీ (ఆపరేషన్స్)గా కూడా పనిచేశారు. పూణే విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక నేరాలలో డాక్టరేట్ పొందిన సదానంద్ దాతే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఈ కీలక సమయంలో మహారాష్ట్ర డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 26/11 Hero
  • 26/11 mumbai attacks
  • Ajmal Kasab
  • Maharashtra New DGP
  • Maharashtra Police

తాజావార్తలు

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

  • Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions